నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ షురూ…

-

కొవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ కొద్ది సేప‌టి క్రితం ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియ‌నుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల‌ను నిర్వ‌హిస్తున్నారు. పోలింగ్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, ఫేస్‌షీల్డులు సమకూర్చారు. ఓటువేసే క్రమంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఓటర్లకు కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించగా.. 24 మందికి పాజిటివ్‌గా తేలింది. వారిలో ఇద్దరు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. మిగిలినవారు పోలింగ్‌ చివరిగంటలో ఓటు వేసేందుకు యంత్రాంగం అవకాశమివ్వనుంది.

ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో మొత్తం 824 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 483 మంది, కామారెడ్డిలో 341 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 67 మంది ఓటర్లు ఉండగా, చందూర్ మండల పరిషత్లో అత్యల్పంగా నలుగురు ఓటర్లు ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 12న ఫలితాలు వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version