బ్రేకింగ్ : షారుఖాన్ కొడుకు ఆర్యన్ కు బెయిల్ తిరస్కరణ

-

ముంబై డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ డ్రగ్స్ కేసు లో కీలక మలుపు చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ముద్దుల తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్ సిబి కోర్టులో చుక్కెదురైంది. ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఎన్సిబి కోర్టు. ఈనెల 7 వరకు ఆర్యన్ కస్టడీలో ఉంచాలని కోర్టు కు విన్నవించారు ఎన్ సిబి అధికారులు.

అయితే దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్ సిబి కోర్టు ..   ఆర్యన్ ఖాన్  మరో మూడు రోజుల పాటు కస్టడీ లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీపై దాడిలో NCB అధికారులు ఆర్యన్ ఖాన్ తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ తోపాటు పలువురు నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version