రేపటి నుంచి ఏపీలో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలకే డోర్ డెలివరీ విధానం పరిమితం కానున్నట్టు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ నిబంధనలు ఉండడంతో ఏమి చేయాలనే దాని మీద మల్లగుల్లాలు పడుతున్నారు అధికారులు. పాత పథకమే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు అనుమతించాలని ఎస్ఈసీని కోరింది ప్రభుత్వం.
2019 సెప్టెంబర్ లో పైలెట్ ప్రాజెక్టు గా శ్రీకాకుళంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ ప్రారంభమయింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ బియ్యం పంపిణీపై ఎస్‌ఈసీ తేల్చకపోవడంతో ఏమవుతుందా ? అనే టెన్షన్ నెలకొంది. పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం అమలు చేసి, అందులో ఉన్న లోటుపాట్లును పరిగణలోకి తీసుకుని ఈ మొబైల్ వాహనాలను తీసుకురావాలని నిశ్చియించిందని చెబుతున్నారు.