బతుకమ్మ కుంట ప్రాంతంలో కూల్చివేతలు ఉండవ్ : హైడ్రా కమిషనర్

-

హైడ్రా విషయంలో ఎటువంటి భయాలు అక్కర్లేదని కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఆక్రమించిన స్థలాల్లో నివాస ప్రాంతం ఉన్నా వారిని కూడా టచ్ చేయడం లేదన్నారు. కేవలం ఖాళీగా ప్రాంతాలను మాత్రమే పునరుద్ధరిస్తామన్నారు. బుధవారం అంబర్ పేట బతుకమ్మ కుంటను సందర్శించిన ఆయన.. బతకమ్మ కుంట పునరుద్ధరణపై స్థానికులతో చర్చలు జరిపారు. తమ ఇళ్లను కూలుస్తారా? అని ప్రశ్నించగా ఇళ్లు, నివాస స్థలాల జోలికి వెళ్లబోమని కమిషనర్ తెలిపారు.

1962 లెక్కల ప్రకారం బతుకమ్మ కుంట 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. ప్రస్తుతం 5.15 ఎకరాలకే పరిమితం అయ్యిందన్నారు.స్థానికుల విజ్ఞప్తితోనే బతుకమ్మ కుంట పునరుద్ధరణకు హైడ్రా నిర్ణయం తీసుకుందన్నారు. 2 నెలల్లో బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తామని తెలిపారు. హైడ్రా ఎఫెక్టుతో నగరంలో రిజిస్ట్రేషన్లు పడిపోయాయని వస్తున్న ప్రచారంపై స్పందిస్తూ రిజిస్ట్రేషన్లు పెరిగాయని చెప్పడానికి తమ దగ్గర లెక్కలు ఉన్నాయన్నారు. అన్నిపార్టీల నుంచి బతుకమ్మ కుంట పునరుద్ధరణకు నన్ను కలిశారని రంగనాథ్ చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news