అక్కడ స్కూళ్లలో నో ఫ్రెడ్‌షిప్, చప్పట్లు కొట్టకూడదు.. వాష్‌రూమ్‌కు మూడే సార్లు వెళ్లాలట..!!

-

స్నేహానికి తొలి మెట్టు పాఠశాల.. ఇక్కడే ఎంతోమంది మనకు స్నేహితులు అవుతారు. కొందరు చిరకాలం అలానే ఉండిపోతారు. అలాంటిది ఆ పాఠశాలలో అసలు ఫ్రెండ్‌షిప్‌ చేయడమే నిషేధమట..వాష్‌ రూమ్‌కు కూడా కొన్నిసార్లు మాత్రమే వెళ్లాలి.. ఈ వింత నిబంధనలను అమలు చేస్తున్న స్కూల్స్ ఎక్కడ ఉన్నాయంటే..

జపాన్ స్కూల్స్- నో మేకప్

ఇక్కడ కొన్ని హైస్కూళ్లు డ్రెస్ కోడ్‌ను తూచా తప్పకుండా పాటిస్తాయి. నిబంధన విధించాయి అంటే విద్యార్థులు తప్పనిసరిగా చేయాల్సిందే. విద్యార్థుల జుట్టు ఎంత పొడవు ఉండాలి.. గోర్ల సైజ్ ఎంత ఉండాలో స్పష్టమైన నిబంధనలు ఉంటాయి. చాలా స్కూళ్లలో మేకప్, నెయిల్ పాలిష్ లేదా ఇయర్సింగ్‌‌ను నిషేధం విధించారు. అలాగే విద్యార్థుల మధ్య రిలేషన్‌షిప్ ఉండకూడదు. రిలేషన్ అనేది పిల్లల దృష్టిని మరల్చుతుందని, దీంతో స్కూల్ డ్రాప్-అవుట్ కేసులు పెరుగుతాయనే కారణంతో ఈ నిబంధనను అమలు చేస్తున్నాయట.!

ఎవర్ గ్రీన్ పార్క్ స్కూల్- వాష్ రూమ్‌కు వెళ్లడంపై పరిమితి

వాష్‌రూమ్‌కు వెళ్లడంపై ఎవరూ పరిమితి విధించరు. కానీ అమెరికాలోని చికాగో నగరంలో ఉన్న ఎవర్‌గ్రీన్ పార్క్ హై స్కూల్‌లో విద్యార్థులు వాష్‌రూమ్‌కి వెళ్లడంపై పరిమితి విధించారు. ప్రతి తరగతిలోని విద్యార్థులు రోజుకు కేవలం మూడు సార్లు మాత్రమే వాష్‌రూమ్‌కు వెళ్లాలనే నిబంధన విధించారు. పిల్లలు అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోకుండా ఉండేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.

చప్పట్లు కొట్టడం, హగ్ చేసుకోవడం నిషేధం

క్లాప్స్‌ కొట్టడం, హగ్‌ చేసుకోవడం చాలా కామన్‌ విషయం..అయితే ఇలాంటి హావభావాలు కొన్ని దేశాల్లోని స్కూల్స్‌లో నిషేధం విధించారు. ప్రధానంగా బ్రిటన్, అమెరికాలోని అనేక స్కూల్స్‌లో చప్పట్లు కొట్టడం, తోటి విద్యార్థులను హగ్ చేసుకోవడం‌ వంటి వాటిని నిషేధించారు.

థామస్ స్కూల్ – ఫ్రెండ్‌షిప్ నిషేధం

ఇది బ్రిటన్‌లో ఉంది. స్కూల్ యాజమాన్యం ఇక్కడ విద్యార్థులు తమ తోటి విద్యార్థులతో స్నేహం చేయకూడదు. అయితే ఈ వెరైటీ నిబంధన పెట్టడానికి కారణం.. స్నేహితుల నుంచి విడిపోయినప్పుడు విద్యార్థులు ఒంటరినైనట్లుగా ఫీల్ అవుతున్నారని.. అందుకే స్కూల్‌లో విద్యార్థుల మధ్య ఫ్రెండ్‌షిప్‌ను నిషేధించామని స్కూల్ యాజమాన్యం చెప్పుకొచ్చింది.

జాక్సిన్ నంబర్ 1 స్కూల్ – మధ్యాహ్నం నిద్ర పోవచ్చు..

మధ్యాహ్నం సమయంలో కూడా ఫ్రెష్‌ లుక్‌లో కనిపించడం కోసం చైనాలోని ఓ స్కూల్ విద్యార్థులను నిద్రపోవడానికి అనుమతిస్తుంది. Gaoxin No.1 అనే ఎలిమెంటరీ స్కూల్‌లో విద్యార్థులు మధ్యాహ్నం 12.10 నుంచి 2 గంటల వరకు భోజన సమయంలో నిద్రపోతారు. పిల్లలు ఫ్రెష్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను అమలు చేస్తోంది. వీళ్ల నిబంధనలతో బాల్యం అంత కట్టు బానిసలా ఉందనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. మంచిదైంది మన దగ్గర ఇలాంటివి లేవు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version