చిన్న జీయర్ కు బిగ్ షాక్.. యాదాద్రి ఆలయ పున: ప్రారంభానికి అందని ఆహ్వానం !

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి దేవాలయాన్ని నిర్మించింది. అయితే రేపు యాదాద్రి మహా సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ యాదాద్రి పున ప్రారంభం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన నుంచి… ఆయన వెంట ఉన్న చిన్న జీయర్ స్వామి ఇప్పుడు అసలు కనిపించడమే లేదు.

రేపు సంప్రోక్షణ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో… చిన్న జీయర్ స్వామి కి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదని సమాచారం అందుతోంది. మొన్నటి వరకు… సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామి ఇద్దరూ ఒకే హెలికాప్టర్లో.. తిరుగుతూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కానీ సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ అనంతరం చిన్న జీయర్ స్వామికి… సీఎం కేసీఆర్ కు మధ్య గ్యాబ్ పెరిగింది. అంతేకాదు ఆ ఎపిసోడ్ అనంతరం చిన్న జీయర్ స్వామి కి వ్యతిరేకంగా అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సీఎం కేసీఆర్ కు చిన్న జీయర్ స్వామీజీ కి మధ్య గ్యాప్ ఉందని చెప్పకనే చెప్పినట్లయింది. ఇక రేపటి యాదాద్రి మహా సంప్రోక్షణ కార్యక్రమానికి కూడా చిన్న జీయర్ స్వామి కి ఆహ్వానం అందకపోవడం వాళ్ళిద్దరి గ్యాబ్ కు మరింత ఆజ్యం పోసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version