ఈ పాలాకు మొక్కతో ఎంతటి నరఘోష, నరదిష్టి అయినా పోతుందట..!

-

నరుడి దిష్టికి నాపరాయి అయినా ముక్కలు అవుతుంది అంటారు.. అంత పవర్‌ ఉంటాయి.. కొన్ని కళ్లు.. పాజిటివ్‌ ఎనర్జీ, నెగిటివ్‌ ఎనర్జీ అని సైన్స్‌లో మాట్లాడుకున్నా.. దిష్టి అని ఆధ్యాత్మికంగా మాట్లాడుకున్నా.. రెండూ ఒకటే.. ఇంటికి దిష్టి తగలకుండా.. గుమ్మడికాయను కడతాం.. నెగిటివ్‌ ఎనర్జీని గ్రహించే శక్తికి గుమ్మడికాయకు ఉంది కాబట్టి కడతాం అని సైన్స్‌ చెబుతుంది. ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా చేయగలిగిన ఒక మొక్క ఉంది. దానిపేరే.. మేక మేయ‌ని ఆకు. దీన్నే పాలాకు తీగ మొక్క అని కూడా అంటారు.. ఎటువంటి దుష్ట శ‌క్తుల‌ను కూడా మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లోకి రాకుండా చేస్తుంది..న‌ర ఘోష‌, న‌ర దిష్టి, న‌ర శాపం, క‌నుదిష్టి వంటివి త‌గ‌ల‌కుండా ఈ మొక్క మ‌న‌కు ర‌క్ష‌గా ఉంటుంది.

ఎన్నో ర‌కాల తాంత్రిక ఉప‌యోగాల కోసం ఈ మొక్క‌ను వాడతారు.. ఈ పాలాకు తీగ మొక్క గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఈ తీగ‌ను ఉప‌యోగించి స‌క‌ల దిష్టి దోషాలు ఎలా తొల‌గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మంగ‌ళ వారం లేదా ఆది వారం ఈ రెండు రోజుల్లో లేదా ఏదైనా అమావాస్య రోజున ఈ మొక్క‌ను మ‌నం దిష్టి నివార‌ణ‌కు ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఉద‌యాన్నే త‌ల‌స్నానం చేసి మొక్క ద‌గ్గ‌రికి వెళ్లి భూమి నుంచి మూడు అడుగులు పై ఉండే కొమ్మ‌ను క‌త్తిరించి తెచ్చుకోవాలి. ఇలా తెచ్చిన కొమ్మ‌ను ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు క‌ట్టినట్టు అడ్డంగా క‌ట్టాలి. త‌ద్వారా ఎటువంటి న‌ర‌దిష్టి, చెడు ఘోష ఇంట్లోకి రాకుండా ఈ తీగ అడ్డుకుంటుంది.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ప్ర‌తి ఒక్క‌రి మ‌ధ్య స‌ఖ్య‌త ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి దిష్టి దోషాలు ఉన్నా కూడా తొల‌గిపోతాయి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి దూరంమై ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డుపుతారు.

న‌ర‌ఘోష‌తో, నెగెటివ్ ఎన‌ర్జీ ఉన్న ఇంట్లో ఉంటూ మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను కోల్పోయి, చిరాకుల‌తో జీవితాన్ని గ‌డుపుతుంటారు.. అలాంటివారు ఈ పాలాకు తీగ మొక్క‌ను ఉపయోగించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంద‌ని జీతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version