మన హిందూ సంప్రదాయంలో ఇంటిని నిర్మించే ప్రతి ఒక్కరూ వాస్తుశాస్త్ర ప్రకారం నిర్మిస్తారు.దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర నిపుణుల సలహాలను తీసుకుంటారు. అయితే, ఇక ఇంటిలో ఏ వస్తువు ఉండాలి అనే విషయం కూడా వాస్తుశాస్త్రం వివరంగా చెబుతుంది.ఇదే మన ఇంటి సంతోషాలను, సుఖదుఃఖలను, సంపాదనను నిర్ణయిస్తుంది. ఒక్కోసారి మనం ఎంత సంపాదించినా ఏమి మిగలకుండా మంచి నీళ్లలా ఖర్చు అయిపోతుంది.అయితే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఉత్తరం దిక్కున ఉంచితే సంపాదించిన సంపద నిలబడి ధనవంతులు అవుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరదిక్కు కుబేరుడి స్థానం అని చెప్పవచ్చు. ఈ దిక్కున కుబేరుడుని ఉంచి పూజిస్తే గొప్ప దనాకర్షణ కలుగుతుంది.ఈ దిక్కున ఎప్పుడు ప్రధాన ద్వారం ఉంచుకోవాలి. ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని కూడా అంటారు.ఇలా చేస్తే లక్ష్మిదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది.
ఉండవలసిన గదులు :
ఉత్తర దిక్కున పడకగది, గది, తోట, వాకిలి,బాల్కనీకి అనుకూలంగా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా ఈ దిశలో ఉత్తమంగా ఉంటుంది.ఇలా ఉంటే పాజిటివ్ ఎనర్జీ కలిగి ధనము నిలుస్తుంది.
బీరువా :
ఉత్తర దిక్కున డబ్బును దాచే బీరువాని ఉంచుకోవాలి. ఉత్తర దిక్కు డబ్బుకు, వృద్ధి కి మూలం కాబట్టి సంపాదించిన సంపాదన మిగిలి, ధనవంతులు అవుతారు.
తులసి చెట్టు :
వాస్తు శాస్త్రం ప్రకారం.. తూర్పు దిశలో తులసి మొక్కను నాటితే ఆ ఇంటికి మంచి జరుగుతుందని నమ్ముతారు. అలా వీలు కాకపోతే మీరు ఉత్తరం దిశలో కూడా పెట్టవచ్చు. ఈ దిశలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.లక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది.
బాత్ రూమ్స్ :
బాత్రూమ్స్ నీ ఉత్తర దిక్కున నిర్మించకూడదు. ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి దనాకర్షణ కలిగిన ప్రదేశంలో బాత్ రూమ్స్ ఉంచకూడదు.ఎందుకంటే సకల మలిన పనులు అక్కడే చేస్తాం. ఇలా నిర్మిస్తే డబ్బు ఇంట్లో నివాసం ఉండకుండా నీళ్లలా ఖర్చు అయిపోతుంది.