ఇక కరోనా వైద్యానికి ఆస్పత్రికి అవసరం లేదు… భారత్ లో అద్భుతమైన పరికరం…!

-

కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు దాని గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా వైద్యులకు ఇబ్బంది లేకుండా ఆస్పత్రుల భారం తగ్గించడానికి గాను ‘రిమోట్‌ హెల్త్‌ మోనిటరింగ్‌ సిస్టం’ను రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ వైద్యులు, బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. కరోనా అనుమానితుల, బాధితుల శరీర ఉష్ణోగ్రత, పల్స్‌రేటు, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి, శ్వాస తీసుకునే వేగాన్ని ఆసుపత్రుల గమనిస్తూ వైద్యులు సేవలు అందించే అవకాశం ఉంటుంది.

ఆస్పత్రులలో వైద్య సేవలు అందించడానికి ఇబ్బంది కావడం వైద్యులు కూడా ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఎయిమ్స్‌ వైద్యులు, బెల్‌ శాస్త్రవేత్తలు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. బాధితుల శరీర ఉష్ణోగ్రత, పల్స్‌రేట్‌, ఇతర ప్రామాణికాలను తెలుసుకునేందుకు గానూ అవసరమైన సెన్సర్లను, ఆ సెన్సర్లలోని సమాచారాన్ని సుదూరంగా ఉండే వైద్యులకు అందించే యాప్‌ను బెల్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం గమనార్హం. ఒక సెన్సార్ గుండె మీద ఉండగా మరో సెన్సార్… చేతి మణికట్టు వద్ద అతికిస్తే రోగి పరిస్థితి అర్ధమవుతుంది.

మొబైల్ తో పాటుగా సిస్టం మానిటర్ లో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. రోగి, అనుమానితుడు మొదటిసారి వచ్చినప్పుడే ఆయనకు అవసరాన్ని బట్టి కిట్‌ ఇవ్వగా… ఇవ్వాల్సిన మందుల గురించి కుటుంబ సభ్యులకు చెప్పి… రోగి ఆస్పత్రికి అవసరం లేకుండా ఇంట్లోనే వైద్యం అందేలా చేస్తారు. రోగి వద్దకు కుటుంబ సభ్యులు వెళ్ళే అవసరం కూడా ఉండదు. ఈ ప్రయోగానికి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), క్లౌడ్‌ పరిజ్ఞానాలను వాడారు. ఎన్ని లక్షల మంది సమాచారాన్ని అయినా సరే తెప్పించుకునే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version