జీవితంలో ఏ కష్టం అయినా ఎదుర్కోవడానికి చాణక్య సూత్రాలు బాగా ఉపయోగపడతాయి ఆచార్య చాణక్య జీవితంలో వచ్చే కష్టసుఖాలని ఎలా భావించాలి..? ఎవరితో ఎలా ఉండాలి ఎటువంటి వారికి దూరంగా ఉండాలి..? ఇలా ఎన్నో ముఖ్య విషయాలని చెప్పారు. ఆచార్య చాణక్య వ్యక్తి విజయానికి వైఫల్యానికి అతని చర్యలే కారణమని అన్నారు. ఎప్పుడైనా సరే మంచి పేరు పొందాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది కానీ అగౌరవం పాలవ్వడం సులభం.
చాణక్య మాత్రం ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. స్త్రీ అయినా పురుషుడైనా సరే ఒక విషయంలో రాజీ పడకూడదని అన్నారు. ఈ విషయంలో కనుక రాజీ పడితే కష్టాలు తప్పవని చాణక్య చెప్పారు. ఆత్మగౌరవం అనేది చాలా ముఖ్యం. నిజానికి మనిషికున్న మూలధనం ఆత్మగౌరవం.
మనిషి చనిపోయే వరకు దాన్ని తప్పక కాపాడుకోవాలి. ఒకసారి ఆత్మగౌరవం దెబ్బతింటే అక్కడ ఉండేందుకు కూడా కష్టంగా ఉంటుంది. పైగా చెడ్డ పేరు వస్తుంది. దానిని తొలగించడానికి కూడా అవ్వదు కాబట్టి ఎప్పుడూ కూడా ఆత్మ గౌరవం విషయంలో రాజీ పడకూడదు. ఆత్మగౌరవం పై దృఢంగా నిలబడే వ్యక్తి వద్ద బాధ ఉండదని చాణక్య చెప్పారు.
ఆత్మ గౌరవం విషయంలో రాజీ పడకుండా ఉంటే కచ్చితంగా ఆనందంగా ఉండడానికి అవుతుంది. మంచిగా ఉండడానికి అవుతుంది. కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే అక్కడ గడపడం కూడా ఎంతో బాధగా ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ఎప్పుడు ఆత్మగౌరవం విషయంలో రాజీ పడాల్సి వస్తుందంటే… మానసికంగా శారీరకంగా లేదంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం పట్ల రాజీ పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటే వారే నిజమైన మనిషి అని ఆచార చాణక్య అన్నారు.