జూబ్లీహిల్స్‌‌లో నాలుగు పబ్బులకు నో పర్మిషన్ : సిటీ పోలీస్

-

కొత్త సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబవుతోంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేడుకల కోసం నగరంలోని పబ్బులు ప్రత్యేక ఈవెంట్స్ ప్లాన్ చేస్తుండగా.. అందులో కొన్నింటికీ అనుమతులు నిరాకరించినట్లు సిటీ పోలీసులు స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో మొత్తం 36 పబ్బులు ఉండగా.. అందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించినట్లు తెలుస్తోంది.

హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్స్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్బుల్లో జరిగిన గొడవలు, పోలీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించాలని వెల్లడించారు. ఇదిలాఉండగా, ఇప్పటికే నగరంలోని పబ్స్ న్యూ ఇయర్ బుకింగ్స్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news