అక్క మంచిదే కానీ బావవ‌ల్లే అంతా.. జ‌గ‌న్ ప‌రిస్థితి ఇదీ..!

-

ఏ నిర్ణయం చూసినా ఇబ్బంది పెట్టేస్తుంది. ఒకటి అయిపోతే మరొకటి… మరొకటి అయిపోతే ఇంకొకటి. అక్క ఆశే గానీ బావ బతకడు అన్నట్టు ఉంది పరిస్థితి. ఏపీ ప్రభుత్వ నిర్ణయాల పరిస్థితికి ఈ సామెత కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇది అన్నా నిలబడుతుందని ఎదురు చూసినా ఏదీ కోర్ట్ కి వెళ్ళిన నిలబడటం లేదు. ఏంటీ ఎందుకు అంటే… గత 15 నెలల్లో సిఎం హోదాలో జగన్ తీసుకునే నిర్ణయాలు, అవి కోర్ట్ కి వెళ్ళే సరికి తేలిపోవడం వంటివి చాలా చికాకుగా ఉన్నాయి. రాజకీయ కారణాలు వేరు. న్యాయ కారణాలు వేరు. కాని ఏపీలో ఈ రెండు కలిపి చూస్తుంది అధికార పార్టీ.

jagan

కోర్ట్ లో కేసు వెళ్ళడం, అది ఓడిపోవడం. రాజకీయ కారణాలతో నిర్ణయాలు తీసుకుంటుంది. కాని న్యాయ పరంగా అవి నిలబడటం లేదు. రాజ్యాంగాలు రాసిన వాళ్ళు చట్టాలు చేసిన వాళ్ళు ఇలాంటివి ఊహించే చేసారు… అన్నట్టుగా ఉంది ఏపీలో పరిస్థితి. అసలు ఈ నిర్ణయాలు అన్నీ సిఎం జగనే తీసుకుంటున్నారా…? ఈ రోజు జ‌రిగిన‌ పరిణామం చూస్తే ఇట్టే అర్థ‌మవుతుంది. విశాఖలో 30 ఎకరాల భూమికి సంబంధించి ఏపీ హైకోర్ట్ విచారణలో భాగంగా భూ కేటాయింపు చేయవద్దు అని చెప్పింది. గంట సమయంలోనే ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక అధికారి నుంచి జీవో వచ్చేసింది.

విశాఖలో గెస్ట్ హౌస్ కోసం గానూ ఈ జీవో జారీ చేసారు. ఈ జీవో సిఎం అనుమతితోనే వచ్చిందా…? కచ్చితంగా కాదనే మాటే వినపడుతుంది. సలహా ఇచ్చే వాళ్ళు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అది. ఇలాంటి సలహాలు ఒకటి కాదు రెండు కాదు. వందల్లో ఉన్నాయి… ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం ఇన్నిసార్లు కోర్ట్ తీర్పులతో ఇబ్బంది పడటమనేది ఇదే తొలిసారి. చిన్న చిన్న నిర్ణయాలు కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఎప్పుడు ఏ పిటీషన్ ఏ రూపంలో దాఖలు అవుతుందో అర్ధం కాని పరిస్థితి.

కాబట్టి తీసుకునే నిర్ణయాల విషయంలో, ఆదేశాలు, ఉత్తర్వులు ఇచ్చే వాళ్ళ విషయంలో సిఎం జగన్ పునరాలోచించుకోవాలి. జగన్ కింద వారు తీసుకునే నిర్ణయాల ప్రభావం గట్టిగా జగన్ కే తగులుతుంది. జగన్ సర్కార్ తప్పుడు నిర్ణయాలు అంటారు గాని, అధికారుల తప్పు అని ఎవరూ అనరూ… కేబినేట్ హోదాలో ఉన్న సలహాదారులు కూడా తిట్లు తినరు. ప్రజల్లో పలచన అయ్యేది జగనే. న్యాయస్థానాల ముందు చట్టాలు నిలబడాలి.

ఆ విధంగా జగన్ సలహాలు తీసుకోవాలి, జగన్ నమ్మి పెట్టుకున్న వాళ్ళు కూడా అవే సలహాలు ఇవ్వాలి. లేదు అంటే అభాసుపాలయ్యేది జగనే. అక్క మంచిదే గాని బావ వల్లే అలా అయిందన్నట్టు… జగన్ ఆలోచన మంచిదే గాని ఆ సలహాలే నాశనం చేస్తున్నాయి. బిజెపి కాచుకుని కూర్చుంది, టీడీపీకి కోర్ట్ తీర్పులు కలిసి వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలు కూడా అయ్యో పాపం జగనన్న అంటున్నాయి. కోర్ట్ తీర్పులు… చట్టాలు, శాసనాలు, న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉంటాయి… దానికి రాజకీయాలు ముడిపెట్టి తిట్టడం, తిట్టించడం కంటే కూడా నిర్ణయాల విషయంలో ఆలోచనతో తీసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version