బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళడమే కంటెస్టెంట్ల వంతు ఆ తర్వాత వారు బయటకి రావడానికి ప్రేక్షకులే కారణమవుతారు. నామినేషన్స్ లోకి వచ్చిన వారిలో ఎవరికి తక్కువ ఓట్లు వస్తాయో వారు ఎలిమినేట్ అవుతారు. అంతకుముందు రావడానికి ఎంత ప్రయత్నించినా వారు పెద్దగా పట్టించుకోరు. ఐతే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే హౌస్ నుండి ఎలిమినేట్ కాకుండా బయటకి వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి సీజన్లో హీరో సంపూర్ణేష్ బాబు, నాలుగవ సీజన్లో గంగవ్వ అలా బయటకి వచ్చినవారే.
ఐతే ఈ నాలుగవ సీజన్లోనే మరో కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకు వచ్చేసాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నోయల్, హౌస్ నుండి బయటకు వచ్చాడు. హౌస్ లో ట్రీట్ మెంట్ జరిగినప్పటికీ మెరుగైన వైద్యం కోసం బయటకి వెళ్ళాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పగా, ఆ మేరకు ఎలిమినేషన్ లేకుండానే కాలు బయటపెట్టాడు. ఐతే వైద్యం కోసం బయటకు పంపుతున్న బిగ్ బాస్, ఆ తర్వాత కోలుకోగానే ఇంట్లోకి ఆహ్వానం ఉంటుందని కూడా చెప్పాడు.