ఆంధ్రప్రదేశ్లో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన నామినేషన్ల దాఖలు పర్వంలో అనేక చోట్ల స్వల్ప ఘర్షణలు జరిగాయి.. ఇంకా రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.
ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు విడుదల ఉంటాయి. ముందుగా సర్పంచ్ వార్డు మెంబర్లు ఫలితాల తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు ఉంటుంది. ఇక తొలిదశలో 168 మండలాల్లో ఉన్న 32 49 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 32 వేల 504 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఎన్నికలు జరిగే ఈ 168 మండలాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు.