ఎల్‌ఐసీ పాలసీలో నామినీ పేరు మార్చుకోవాలా..? అయితే ఇలా చెయ్యండి..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ రకాల సేవలని అందిస్తోంది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది పాలసీదారులను కలిగుంది LIC. పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా డెత్ క్లెయిమ్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అయితే పాలసీని కొనుగోలు చేసినప్పుడు నామినీ పేరును నమోదు చేయడం అవసరం. నామినీ పేరు నమోదు చేసుకున్న తరవాత ఆ పేరు ని మళ్ళీ మార్చాలి.

ఒకసారి నామినీని నమోదు చేసాకా ఆ పేరును మార్చవచ్చు. ఎన్నిసార్లు అయినా కూడా మార్చుకోవచ్చు. దీనికి ఎలాంటి పరిమితిని నిర్ణయించలేదు. ఇక మరి మనం నామినీ పేరు ని ఎలా మార్చచ్చు అనేది చూసేద్దాం.

నామిని ని ఎలా మార్చాలి..?

బీమా పాలసీ తీసుకున్నాక మెచ్యూరిటీ వరకు మీకు కావలసినప్పుడు నామినీ ని మార్చచ్చు.
ఇప్పటికే ఉన్న నామినీకి తెలియజేయాల్సిన అవసరము లేదు. ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లి అక్కడ నుండి నామినేషన్ మార్పు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరవాత నామినీ ని చెయ్యాల్సిన వ్యక్తి వివరాలని ఇవ్వాలి. ఎల్‌ఐసీ శాఖను సందర్శించడం ద్వారా నామినీ పేరును మార్చచ్చు.

ఈ డాక్యుమెంట్స్ అవసరం:

పేరు మార్పు కోసం పత్రాలు, పాలసీ బాండ్, పాలసీదారు, నామినీ మధ్య రిలేషన్ షిప్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version