మరోసారి బాలిస్టిక్‌ మిస్సైల్‌ను పరీక్షించిన నార్త్ కొరియా

-

ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు తెగబడింది. నార్త్ కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేసినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా తూర్పు వైపున గుర్తు తెలియని బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు.. జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ కూడా.. ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ధ్రువీకరించింది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది.

అణ్వాయుధాలు కలిగి ఉన్న ఉత్తర కొరియా ఈ ఏడాది రికార్డు స్థాయిలో పరీక్షలు  నిర్వహించింది. గతవారం నాలుగుసార్లు స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైల్‌ను పరీక్షించింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంతోపాటు ఆ దేశంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పర్యటించడంతో ఆగ్రహానికి గురైన ఉత్తర కొరియా వరుసగా క్షిపణులను పరీక్షిస్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మరో అణు పరీక్షకు సిద్ధమవుతున్నారని దక్షిణ కొరియా, అమెరికా వర్గాలు గత కొద్ది నెలలుగా హెచ్చరిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version