కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, ఆ దేవదేవుడికీ నిద్ర కరువైంది : రోజా

-

ఏపీ ప్రభుత్వం తీరుపై నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుంది. సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా,మన కోసమూ.సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు.

జగనన్న పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేవి. కానీ, ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు.దర్శనాల సంఖ్య 60 వేల చుట్టూ పరిమితం చేస్తూ, రోజుకు 7 నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోంది.

సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇదేనా కూటమి @PawanKalyan, @BJP4Andhra సనాతన ధర్మం? ఇదేనా @JaiTDP, @ncbn చంద్రబాబు గారి నమూనా ప్రక్షాళన? భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు!!’ అని సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news