నటి హేమకు బిగ్ షాక్.. నోటీసులు జారీ

-

“మా” అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో…. టాలీవుడ్ పరిశ్రమలో వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇటీవల నటి హేమ మా అసోసియేషన్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నిధుల దుర్వినియోగం జరిగిందని మా అసోసియేషన్ పై ఆరోపణలు చేశారు.

 

Naresh Actress Hema | నరేష్ నటి హేమ

అయితే నటి హేమ వ్యాఖ్యలపై నటుడు నరేష్ మరియు జీవిత రాజశేఖర్ తీవ్రంగా స్పందించారు. నటి హేమ చేసిన ఆరోపణలు చాలా దారుణమని…. దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రెస్ మీట్ పెట్టి పేర్కొన్నారు. మా అసోసియేషన్ పరువు దిగజార్చేలా వ్యవహరించిందని క్రమశిక్షణ కమిటీ కి ఫిర్యాదు చేశారు. హేమ మాట్లాడిన వీడియో ఫుటేజీలను కూడా సాక్ష్యాలుగా జతచేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా క్లాజ్ 8 భైలస్ కింద నటి హేమ కు నోటీసులు జారీ అయ్యాయి. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలని… చర్యలు తీసుకోవాలని డి ఆర్ సికి రాసిన లేఖలో పేర్కొన్నారు అధ్యక్షుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version