ఎస్‌బీఐలో ఉద్యోగాలు… వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్‌బీఐ ) -SBI స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 2021 సెప్టెంబర్ 2 లోగా దరఖాస్తు చేయాలి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు.

SBI | ఎస్‌బీఐ

 

ఇక దీనికి సంబంధిచి పూర్తి వివరాలలోకి వెళితే.. నోటిఫికేషన్‌లో వెల్లడించిన సబ్జెక్ట్‌లో అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ లాంటి కోర్సులు పాస్ కావాలి. వేతనం రూ.78,000 వరకు వస్తుంది. విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్‌ లో తెలుసుకోవచ్చు.

వయస్సు 20 నుంచి 25 ఏళ్ల వరకు ఉండాలి. అభ్యర్థులకు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకునే అభ్యర్థులు https://sbi.co.in/web/careers వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోచ్చు.

పోస్టుల వివరాలు :

అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్- 36
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్-10
డిప్యూటీ మేనేజర్ అగ్రికల్చర్ స్పెషలిస్ట్- 10
రిలేషన్‌షిప్ మేనేజర్ (ఓఎంపీ) -6
ప్రొడక్ట్ మేనేజర్ (ఓఎంపీ) -2
అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్)- 4
సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్-1

ఇలా అప్లై చేసుకోండి:

https://sbi.co.in/web/careers వెబ్‌సైట్ ఓపెన్ చేసి…
కెరీర్స్ సెక్షన్‌లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నోటిఫికేషన్ ని చూడచ్చు.
వేరు వేరు పోస్టులకు వేర్వేరు దరఖాస్తు లింక్స్ ఉంటాయి.
అప్లై చేయాలనుకునే పోస్టు లింక్ పైన క్లిక్ చెయ్యండి. అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Click for New Registration పైన క్లిక్ చేయాలి.
మీ పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ .టైప్ చేసి..
ఇతర వివరాలు కూడా ఇచ్చేయండి.
ఇప్పుడు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
మీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫీజు పేమెంట్ పే చేసేయాలి అంతే.

Read more RELATED
Recommended to you

Exit mobile version