NTR 30: ఆశ్చర్యపరిస్తున్న సైఫ్ అలీ ఖాన్ రెమ్యూనరేషన్..!

-

రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా తీసిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్నారు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఆయన తదుపరిచిత్రం పై ప్రతి ఒక్కరు అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తన క్యారెక్టర్ కి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్న రెండవ షెడ్యూల్ కి ఆయన జాయిన్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇతర విషయాలు కూడా చిత్ర సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో ఆయన నటిస్తున్నందుకు గాను ఎంత పారితోషకం తీసుకుంటున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఏకంగా రూ.5 కోట్ల రెమ్యునరేషన్తో పాటు బాలీవుడ్ లో విడుదలైతే అక్కడ వచ్చే లాభాల్లో కూడా ఆయన వాటా తీసుకోబోతున్నట్లు సమాచారం.

వాస్తవానికి ఐదు కోట్ల రెమ్యునరేషన్ అనేది ఆయన క్రేజ్ కి ఏ మాత్రం సరితూగదు. అయితే ఆయన బాలీవుడ్ రైట్స్ విషయంలో నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. లాభాల్లో ఆయనకు కనీసం ఐదు కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఎటు లేకున్నా ఆయనకు 10 కోట్ల రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది ఇకపోతే ఇది రూమర్ గా స్ప్రెడ్ అవుతోంది తప్ప..ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించబోతున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version