ఎన్టీఆర్ తో డేటింగ్ చెయ్యాలని ఉంది…!

-

టాలీవుడ్ లో జనాలు అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకుంటూ సోషల్ మీడియాలో హడావుడి ఎక్కువగా చేస్తున్నారు. సినిమాల అవకాశం ఎక్కువగా ఎదురు చూస్తున్నా హీరోయిన్స్, యాంకర్ లు ఏదోక సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తమ మనసులో ఏం ఉందో చెప్పడానికి ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదు.

తాజాగా జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన యాంకర్ రేష్మీ గౌతం ఇదే విధంగా వ్యాఖ్యలు చేసింది. ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఎన్టీఆర్‌తో స్పెషల్ సాంగ్ చేసే అవకాశమొస్తే ఏమి చేస్తారు అనే ప్రశ్నకు గానూ… ఛాన్స్ రావలే గానీ ఎందుకు వదలుకుంటా అంటూ సమాధానం చెప్పింది. అదే విధంగా మరికొన్ని ప్రశ్నలు అడిగారు ఆమె అభిమానులు ఆమెను.

మీరు ఏ హీరోతో డేట్ చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు గానూ తెలుగులో తనకు ఎన్టీఆర్‌తో పాటు మరో ఇష్టమైన హీరో ఉన్నాడని చెప్పింది. ఎన్టీఆర్‌కు పెళ్లైపోయింది కాబట్టి ఆయనతో డేటింగ్ కాస్త కష్టమే అని చెప్పిన రేష్మీ… కానీ ఆ హీరో పిలిస్తే మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా అతనితో డేట్‌కు వెళతానని ఏ మాత్రం మొహమాటం పడకుండా చెప్పింది. ఇంకో హీరో పేరు చెప్పలేదు ఆమె.

Read more RELATED
Recommended to you

Exit mobile version