‘ సైలెంట్ ‘ గా సాధిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ?

-

విభజనతో ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఆర్థికంగా నష్టపోయింది. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి భయంకరమైన అప్పులు చేయడం జరిగింది. పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ రాష్ట్రానికి 2019 లో జగన్ ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఇలాంటి టైమ్ లో ప్రభుత్వపరంగా ఖర్చులన్నీ తగ్గించు కుంటూ ఎక్కడా కూడా పబ్లిసిటీ పెద్దగా చేసుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ రావటంతో మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. అయినా కూడా ఎక్కడా జగన్ వెనుకడుగు వేయలేదు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఉద్యోగస్తులకు జీతాల్లో కోతలు పెడుతున్న టైంలో ఏపీలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెండు విడతలుగా ఇస్తామని మాటిచ్చారు. లాక్ డౌన్ కష్టాల సమయములో వ్యవసాయ పనులు ఆగకుండా నిబంధనలు సడలించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు జగన్ తీసుకుంటున్నారు. మరోపక్క పేద ప్రజలకు వెయ్యి రూపాయలు నగదు రూపంలో ఇచ్చి రెండు సార్లు ఇప్పిటికే ఉచితంగా రేషన్ ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ వ్యవహారం నడుస్తూ ఉండగానే ఏపీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద డబ్బులు చెల్లించడం జరిగింది. తాజాగా వైయస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళల పొదుపు సంఘాలకు 1400 కోట్ల రూపాయలు నిధులు బ్యాంకుల్లో జమచేసి చేసి ప్రజల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు.

 

ఎన్ని చేసినా కానీ మరోపక్క ప్రతిపక్షాల నుండి విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. దేశంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో జగన్ విఫలమయ్యాడని విమర్శలు చేస్తున్నాయి. కానీ కరోనా వైరస్ కట్టడి టెస్టులు ఎక్కువ జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అలాగే ICU బెడ్స్ విషయంలో దేశంలో మూడో స్థానంలో ఉండగా, వెంటిలేటర్స్ లో దేశంలో ఐదో స్థానంలో ఉంది. ఇక ఐసోలేషన్ బెడ్స్ లో కూడా ఐదో స్థానంలో ఉంది. ఈ విధంగా భయంకరమైన కరోనా మహమ్మారి తో పోరాటం చేస్తూనే మరోపక్క పేదవాడికి ఇళ్ల పట్టాల కార్యక్రమం అందించడానికి కూడా రెడీ అవుతున్నారు జగన్. అయితే ఎక్కడా కూడా మీడియా ముందు డప్పు కొట్టుకోకుండా సైలెంట్ గా ప్రజల మన్ననలను సాధించుకునే ముందుకు వెళ్తున్నారు జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version