రేప‌టి నుంచే ఎన్టీఆర్ కొత్త షో.. బుల్లితెర‌పై కొత్త జోష్‌!

-

టాలీవుడ్‌లోన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న‌కు మ‌ల్టీ ట్యాలెంటెడ్ యాక్ట‌ర్‌గా మంచి పేరుంది. ఇక ఆయ‌న ఇప్ప‌టికే బిగ్ బాస్ ద్వారా హోస్ట్ గా కూడా మారారు. అయితే ఆ త‌ర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు మ‌ళ్లీ బుల్లితెర‌పై ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న న‌టిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ చివరికి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేస్తారు.

ఎన్టీఆర్ /NTR

ఇక ప్పుడు ఎన్టీఆర్ మరోసార్ ఆట నాది గెలుపు మీది అనే కొత్త షో తో వ‌స్తున్నాడు. బుల్లితెర లోని ఓ ప్రముఖ ఛానల్ అయిన జెమినిటీవీలో ప్ర‌సారం అయ్యే ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్నాడు.

ఆయ‌న ప్ర‌స్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో రేపటి నుండి( శ‌నివారం) నుంచే ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో ఎన్టీఆర్ పాల్గొంటార‌ని తెలుస్తోంది. వారం రోజుల దాకా ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన షూటింగులో ఎన్టీఆర్ పాల్గొని షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటార‌ని, ఆ త‌ర్వాత ఆయ‌న జులై 20 నుండి కంటిన్యూగా ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటార‌ని ఇప్ప‌టికే తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version