Breaking : సుప్రీంకోర్టును ఆశ్రయించిన నుపుర్‌ శర్మ

-

ముస్లిం మత ప్రవక్తపై మాజీ బీజేపీ నాయకురాలు నుపుర్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాకుండా ముస్లిం దేశాల్లో సైతం నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల వివాదంలో చిక్కుకున్న బీజేపీ బ‌హిష్కృత నేత నుపుర్ శ‌ర్మ సోమ‌వారం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌కుండా నిలువ‌రించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు నుపుర్ శ‌ర్మ. అంతేకాకుండా దేశ‌వ్యాప్తంగా త‌న‌పై న‌మోదైన అన్ని కేసుల‌ను ఒకే కేసుగా మార్చాల‌ని కూడా త‌న పిటిష‌న్‌లో సుప్రీంకోర్టును అభ్య‌ర్థించారు నుపుర్ శ‌ర్మ.

ఈ పిటిష‌న్‌లో నుపుర్ శ‌ర్మ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని కూడా కోర్టుకు తెలిపారు నుపుర్ శ‌ర్మ. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నుపుర్ శ‌ర్మ‌పై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం నేప‌థ్యంలోనే బీజేపీ ఆమెను బ‌హిష్క‌రించింది. నుపుర్ శ‌ర్మ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంద‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version