చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మంత్రి జోగి రమేశ్‌కు నోటీసులు

-

మంత్రి జోగి రమేశ్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఇక దీనికి సంబంధించిన వీడియో ఆధారాలను అందజేశారు. దీంతో ఎన్నికల సంఘం మంత్రి జోగి రమేశ్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ,సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫెక్సీలను తొలగించారు. అంతేకాదు ఎన్నికల నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఎవరు అతిక్రమించినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయినా సరే నేతలు ఎన్నికల ఆదేశాలను లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించి వివరణ ఇవ్వాలని ఆయా నాయకులకి నోటీసులు జారీ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version