హార్దిక్ పాండ్యకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వనున్న ముంబై ఫ్రాంచైజి ?

-

ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుండి హార్థిక్ పాండ్యని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే హర్డిక్ పాండ్య ని కెప్టెన్గా ప్రకటించిన ముంబై ఇండియన్స్ , ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో హార్థిక్ పాండ్యా పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్లోనే హార్దిక్ పాండ్యను ముంబై కెప్టెన్సీ నుంచి తొలగించవచ్చని వార్తలు వస్తున్నాయి. పాండ్యకు రెండు అవకాశాలు ఇవ్వాలని ముంబై ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ తెలిపింది. తర్వాత జరిగే 2 మ్యాచుల్లో ముంబై నెగ్గడంతో పాటు వ్యక్తిగతంగానూ రాణించాలని హార్దిక్కు షరతు విధించిందట. లేదంటే నాయకత్వంలో మార్పులు చేస్తామని చెప్పినట్లు సమాచారం. కాగా, తొలి 3 మ్యాచుల్లో ముంబై ఓడిపోయింది.

కాగా, ఇటు అభిమానులు కూడా హర్డిక్ పాండ్య కెప్టెన్సీ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముంబైకి కెప్టెన్గా రోహిత్ శర్మ మరో సంవత్సరం పాటు ఉంటే బాగుండేదనీ కొందరు అభిమానులు అంటుంటే మరికొందరు ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ముందే రోహిత్ కి తెలియజేసి గౌరవంగా అతని ద్వారానే కెప్టెన్ గా తప్పుకొమ్మని చెప్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version