రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, 15 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం…!

-

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ వైరస్ ను అరికట్టాలని దేశం నలుమూలల లాక్ డౌన్ ప్రతించి ప్రజలందరూ ఒక్కతాటి పై నిలిచారు. అన్ని చోట్ల కరోనా నివారణ చర్యలు చాలా సీరియస్ గా అమలు అవుతున్నాయి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితుల కోసం 1000 బెడ్స్‌తో ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 649 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో తొలి కరోనా మరణం నమోదైంది. భారత్‌లోని మొత్తం కరోనా బాధితుల్లో 47 మంది విదేశీయులు ఉన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భువనేశ్వర్‌లో 1000 పడకల ఆస్పత్రి ఏర్పాటు కోసం SUM, KIIMS తో ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఈ ఆసుపత్రి నిర్మించడానికి అయ్యే ఖర్చులను ఒడిశా మైనింగ్ కార్పొరేషన్, మహానది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థలు భరించనున్నాయి. 15 రోజుల్లోగా ఇటువంటి ఒక అత్యున్నత స్థాయి ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్టు ANI వార్తా సంస్థ పేర్కొంది. ఈ వైద్య సేవలు 15 రోజుల్లోనే అందుబాటులోకి రానున్నట్టు తెలిసింది. KIIMS ఆసుపత్రి యాజన్యం కూడా 450 బెడ్స్ ఆస్పత్రిని నెలకొల్పనుంది. ఇక SUM మేనేజ్‌మెంట్ 500 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా ఇక్కడ ఐసీయూ సేవలను కూడా అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version