అయ్యో.. విమానం నుంచి దూకేసిన హీరోయిన్ మెహ్రీన్.. !

-

టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ తాజాగా విహారయాత్రలు చేస్తుంది అలాగే ఈ సందర్భంగా ఎన్నో సాహసాలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా వాటిని పంచుకుంటుంది తాజాగా ఆమె చేసిన మరో సాహసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

హీరోయిన్ మెహరీన్ ఇంతకుముందు అండర్ వాటర్ లో వాటర్ డైవ్ చేస్తూ ఉన్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది అప్పుడే ఈ భామ ధైర్యానికి మెచ్చుకుంటూ వచ్చిన ఆమె అభిమానులు తాజాగా ఈమె చేసిన స్కై డ్రైవ్ చూసి ఆశ్చర్యపోతున్నారు..

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది మెహ్రిన్.. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తాజాగా అబుదబిలో చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది. వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసి వారెవ్వా అనిపించింది. స్కై డైవ్ కు వెళ్లడానికి ముందు చాలా ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నట్లు.. లైఫ్ లో మొదటిసారి ఇలా చేస్తున్నట్టు చెప్పకు వచ్చింది.. అలాగే హార్ట్ బీట్ పెరిగినట్లు వివరించింది. స్కై డైవ్ కు తీసుకెళ్లే సిబ్బందితో కలిసి తేలికపాటి విమానంలోకి ఎక్కింది. వేల అడుగుల ఎత్తుకు చేరాక విమానంలో నుంచి కిందికి డైవ్ చేసింది. అలాగే గాల్లో తేలుతూ తన ఆనందాన్ని తెలిపింది అలాగే ఈ అనుభవాన్ని తన జీవితంలో మర్చిపోలేని అంటూ చెప్పుకొచ్చింది మెహరీన్..

Read more RELATED
Recommended to you

Exit mobile version