ఇటీవల కాలంలో దొంగలు ముఖాలు కనపడకుండా మాస్కులు ధరించి, వేలిముద్రలు పడకుండా గ్లౌజులతో, కాళ్లకు షూతో పక్కా ప్లానింగ్‌తో దొంగతనాలు చేసుకుపోతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ నిఘా పెడుతున్నా వీళ్ల దోపిడీలకు మాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా వృద్ధుడే కదా ఏం చేస్తాడులే.. సులువుగా డబ్బు దోచుకుని పారిపోదామనుకున్నాడో దుండగుడు. కానీ తాత రంగంలోకి దిగేసరికి తోకముడిచిపారిపోయాడు. దీనికి సంబంధిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధుడు ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేందుకు కార్డిఫ్ ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్ వద్ద కారు ఆపాడు.
ఏటీఎం నుంచి నగదు తీసుకున్నాకు వెనక్కుతిరిగి తన కారువద్దకు వచ్చాడు. అయితే హఠాత్తుగా.. వృద్ధుడికి ఎదురుగా వచ్చిన దుండగుడు అతడిని తోసేసి, డబ్బు తీసుకునేందుకు సిద్దమయ్యాడు. అయితే బాధితుడు మాత్రాం దుండగుడిపై పిడిగుద్దులు కురిపిస్తూ రెచ్చిపోయాడు. తగ్గేదేలేదంటూ పంచ్ విసిరాడు. తాత ఈ రేంజ్‌లో తిరగబడాతాడని ఊహించని దొంగ చివరికి దబిడిదిబిడి అయిపోయింది. సీసీటీవీ కెమరా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు ప్రస్తుతంం సోషల్ మీడియా బాట పట్టి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. వృద్ధుడి ధైర్యానికి వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.