BREAKING తెలంగాణలో మొదలైన ఓమిక్రాన్.. హైదరాబాద్ లో 2 ఓమిక్రాన్ కేసులు గుర్తింపు..

-

దేశాన్ని కలవర పెడుతున్న ఓమిక్రాన్ తెలంగాణలో కూడా  అలజడి రేపుతోంది. ఇప్పటికే దేశాన్ని కలవరపెడుతున్న ఓమిక్రాన్ వేరియంట్.. తాజాగా తెలంగాణకు కూడా వ్యాపించింది. హైదరాబాద్ లో తొలి ఓమిక్రాన్ కేేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ లో కూడా ప్రస్తుతం 2 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటీివల అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఓమిక్రాన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. మరొకరు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లిన మరో ప్రయాణికుడికి ఓమిక్రాన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో బాధితులు ఉన్నారు.

తొలి కేసులు నమోదవ్వడంతో తెలంగాణ ఉలిక్కి పడింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికుకలు కరోనా పాజిటివ్ వచ్చింది. జీనోమ్ సిక్వెన్సింగ్ పంపిన తర్వాత సదురు వ్యక్తులకు ఓమిక్రాన్ సోకినట్లు తేలింది. మరికొద్ది సేపట్లో అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ వైద్యారోగ్య శాఖ అలెర్ట్ అయింది. అన్ని జిల్లాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వీరితో కాంటాక్ట్ లోఉన్న వారిని వెతికే పనిలో అధికారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version