ఓమిక్రాన్ ఎఫెక్ట్ : మ‌రో రాష్ట్రంలో వీకెండ్ క‌ర్ఫ్యూ

-

దేశంలో క‌రోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. క‌ఠిన ఆంక్ష‌ల‌ను విధిస్తు క‌రోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంటును అడ్డుకోవ‌డానికి ప్ర‌త‌య్నం చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం వీకెండ్ క‌ర్ఫ్యూ విధించింది. తాజా గా క‌ర్ణాట‌క రాష్ట్రం కూడా వీకెండ్ క‌ర్ఫ్యూ విధిస్తు నిర్ణ‌యం తీసుకుంది. క‌ర్ణాట‌క రాష్ట్రంలో రోజు రోజు కరోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ముఖ్య మంత్రి బ‌సవ రాజ్ బొమ్మై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం వైద్యుల స‌ల‌హా మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌ల్లో ఉన్న రాత్రి క‌ర్ఫ్యూను మ‌రో రెండు వారాల‌కు పోడిగించింది. అలాగే క‌ర్ణాట‌క రాష్ట్రంలో విద్యా సంస్థ‌ల‌ను మ‌రో రెండు వారాల పాటు మూసివేయాల‌ని కూడా నిర్ణయం తీసుకుంది. అయితే దీనిలో నుంచి 10, 12 వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మిన‌హాయింపు ఇచ్చారు. అలాగే బార్లు, థీయేట‌ర్స్ 50 శాతం మందితోనే క‌రోనా నిబంధ‌నలు పాటించాల‌ని సూచించారు. వీటితో పాటు పండ‌గ‌లు, పెళ్లిల పై కూడా ఆంక్ష‌లు విధించారు. రెండు డోసులు తీసుకున్నావారే బ‌య‌టకు రావాల‌ని సూచించారు. గోవా, మ‌హారాష్ట్ర, కేర‌ళ రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారు త‌ప్ప‌క నెగిటివ్ రిపోర్ట్ చూపాల‌ని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version