ఓమిక్రాన్ ఎఫెక్ట్: బోర్డర్స్ క్లోజ్ చేసిన ఇజ్రాయిల్… ఆంక్షల దిశగా పలు దేశాలు.

-

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కొత్త వేరియంట్ కేసులను కనుక్కుంటున్నారు. దక్షిణాఫ్రికాతో పాటు దాని సమీపంలోని దేశాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల బెల్జియం, ఇజ్రాయిల్ దేశాల్లో కూడా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆస్ట్రేలియాలో కూడా రెండు ఓమిక్రాన్ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి ప్రపంచ దేశాలు ఆంక్షల దిశగా ప్రయాణిస్తున్నాయి.

ఇజ్రాయిల్ దేశం ఓమిక్రాన్ నేపథ్యంలో తన సరిహద్దులను మూసేసింది. విదేశీయులు ఇజ్రాయిల్ కు రాకుండా ఆంక్షలు విధించింది. మరోవైపు బ్రిటన్ కూడా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకుని నెగిటివ్ వస్తేనే దేశంలోకి అనుమతించేలా ఆంక్షలు విధించింది. మరోవైపు ప్రపంచంలోని అన్నిదేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. ముఖ్యంగా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా, బోట్స్ వానా, నమీబియా, జింబాంబ్వే, హాంకాంగ్ దేశాల నుంచి ప్రయాణికులు రాకుండా ఇతర దేశాాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version