కాలం తలకిందులు అయితే ఒకప్పుడు గొప్పగా బతికిన వారు సైతం రోడ్ల మీదకు వచ్చేస్తారు. బాగా ధనవంతులుగా జీవనం గడిపిన వారు ఒక్కసారిగా నిరుపేద జీవితం గడపాల్సి వస్తుంది. అందుకే మనిషి అన్ని వేళలా ఒదిగి ఉండాలని పెద్ద చెబుతుంటారు. నాలుగు డబ్బులు కనిపించగానే విపరీతంగా ఖర్చు చేయడం, ధనాన్ని చులకనగా చూడకుండా రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుతుంటారు. పొదుపు చాలా ప్రాధాన్యం ఇవ్వాలంటారు.
తాజాగా బెంగళూరులో ఓ బెగ్గర్ ఇంగ్లీషులో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. విషయం ఏంటా అని ఆరా తీయగా.. గతంలో బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్కులో ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేసిన వ్యక్తి ఇప్పుడు అదే నగర రోడ్లపై భిక్షాటన చేస్తున్నాడు. తన పేరెంట్స్ చనిపోవడంతో అతడు తాగుడుకు బానిసై రోడ్లపై అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరూ తనకు తోడు లేరని, తాగుడుకు బానిస కావడంతో ఉద్యోగం పోవడంతో డిప్రెషన్‌కు గురై రోడ్లమీద బిక్షాటన చేస్తున్నట్లు తెలిసింది.
ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ఇప్పుడు బెగ్గర్
బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్కులో ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేసిన వ్యక్తి ఇప్పుడు భిక్షాటన చేస్తున్నాడు.
తన పేరెంట్స్ చనిపోవడంతో అతడు తాగుడుకు బానిసై రోడ్లపై అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. pic.twitter.com/jdGzfn7KJx
— ChotaNews (@ChotaNewsTelugu) November 27, 2024