ఒకప్పుడు వందకోట్లకు యజమాని.. కానీ ఇప్పుడు కూటికి కూడా లేదు..!

-

లక్ష్మీదేవికి ఎవరి దగ్గర ఉండాలో బాగా తెలుసు అనుకుంట..తనకు గౌరవం, విలువ ఇవ్వని వాళ్ల దగ్గర ఎంత కష్టపడినా నిలవదు అంటారు.. అందుకే కొంతమంది ఎంత కష్టపడ్డా తింటానికి, ఉండటానికి తప్ప ఏం వెనకేసుకోలేరు.. ఇంకొంతమంది ఏం చేసినా అదృష్టమే అన్నట్లు ఉంటారు. ఓ వ్యక్తి ఒకప్పుడు కోటీశ్వరుడు.. కానీ ఇప్పుడు బిచ్చగాడు అయ్యాడు..కారణం ఆయన చేసిన పనులే.. అసలు ఏం జరిగిందంటే..!

బ్రిటన్ నివాసి జాన్ మెక్‌గిన్నిస్‌కు.. 1997 సంవత్సరంలో రూ. 100 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని లైఫే మారిపోయింది.. డబ్బులను ఎడాపెడా ఖర్చు చేశాడు. బెంట్లీ, మెర్సిడెస్, జాగ్వార్, ఫెరారీ, బీఎండబ్ల్యూ మోడళ్ల కార్లను కొనుగోలు చేశాడు. రూ.13 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను సొంతం చేసుకున్నాడు. ఇది కాకుండా, 5 కోట్ల విలువైన సీఫేసింగ్ అపార్ట్‌మెంట్ కొన్న తర్వాత, అతను తన కుటుంబం కోసం దాదాపు 30 కోట్లు ఖర్చు చేశాడు. పక్కా ప్రణాళిక లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టడంతో లాటరీ సొమ్ముతో కూడబెట్టినదంతా పోగొట్టుకున్నాడు.

తాను లగ్జరీ కార్లను కొనుగోలు చేయడమే కాకుండా అనేక విలాసవంతమైన ప్రదేశాలలో గడిపానని జాన్‌ చెప్పాడు. విలాసవంతమైన జీవితం గడపడం కోసమే గెలిచిన డబ్బును అంతా వృధా చేశానని ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు షాపింగ్ బిల్లులు ఎలా చెల్లించాలో తెలియక సతమత అవుతున్నాడట.. ఒకప్పుడు కేవలం డిజైనర్ బట్టలే వేసుకుని, విలాసవంతమైన సెలవుల్లో కోట్లకు పడగలెత్తిన జాన్.. ఇప్పుడు కటిక పేదవాడిగా మారాడు.

అందుకే డబ్బు రాగానే.. ముందు వెనక చూడకుండా ఆగంగా ఖర్చుపెడితే అది ఎక్కువ కాలం నిలవదు..కుర్చోని తింటే..కొండలైనా కరిగిపోతాయి.. డబ్బును డబ్బే సృష్టిస్తుంది..ఈ కాన్సప్ట్‌ మీకు మీరు తెలుసుకుంటేనే అర్థమవుతుంది. ఉన్న రూపాయిని ఎలా పొదుపు చేయాలి, ఎలా డబల్‌ చేయాలో కనీస అవగాహన ఉండాలి. అవసరాలకు, కోరికలు మధ్య తేడా తెలిసి ఉండాలి..! అప్పుడే లక్ష్మీదేవి మనతో ఉంటుంది.. లేదంటే ఎన్ని కోట్లు ఉన్నా..చివరికి జాన్‌లానే అయిపోతాం.. !

Read more RELATED
Recommended to you

Exit mobile version