లోన్ యాప్ వేధింపులకు మరో బలి.. సాఫ్ వేర్ ఇంజనీర్ సూసైడ్

-

ఆన్ లైన్ లోన్ యాప్ లవేధింపులకు అడ్డు ఏమీ లేకుండా పోతోంది. నిన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్ చేసుకోగా నేడు సాఫ్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్ స్టంట్ లోన్ యాప్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సునీల్ 70 అప్పు తీసుకున్నాడు. 70 వేలు అప్పు తీర్చాలంటూ తీవ్ర స్థాయిలో లోన్ యాప్ ప్రతినిధులు ఒత్తిడి తెచ్చారు. ఒక యాప్ బాకీ  తీర్చేందుకు మరో యాప్ లో లోన్ తీసుకున్నాడు. అలా చూస్తూ చూస్తూ అప్పుల ఊబిలో కి దిగిపోయాడు సునీల్.

ఆ 70 వేలు అప్పు కట్టకపోవడం తో సునీల్ తల్లి కి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు యాప్ నిర్వాహకులు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సునీల్ రాజేంద్ర నగర్ కిస్మాత్ పూర్ లోని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు సునిల్. ఆన్ లైన్ లోన్ యాప్ ప్రతి నిధులు వేధింపులతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీస్ లకు  మృతుడి భార్య రమ్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version