కరోనా వైరస్ వైరస్‌తో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇంకా భయం తొలగకముందే.. చైనా పరిశోధకులు మరో బాంబును పేల్చారు. మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న ఓ కొత్త ఫ్లూ వైరస్ ను గుర్తించినట్లు చెప్పారు. ఈ కొత్త వైరస్ పేరు G4 EA H1N1 అని పెట్టారు. 2009లో వచ్చిన స్వైన్ ఫ్లూకు దగ్గరగా ఈ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్ ను అడ్డుకోవాలంటే.. పందులను నియంత్రించాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు.
ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ఈ కొత్త వైరస్ గురించి ప్రచురించారు. ఈ వైరస్ ఇప్పటికే జంతువులనుండి మనుషులకి సోకిందని తెలిసింది. మనిషి నించి మనిషి కి సోకుతుందేమో అని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే మరొక మహమ్మారి తయారౌతుందని భయపడుతున్నారు. కనుక తొలిదశలోనే అరికట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.