తమిళనాడు రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. జెండా స్తంభం కూలి ఓ వ్యక్తి మరణించారు. తమిళ హీరో విజయ్ పార్టీకి సంబంధించిన జెండా కూలడంతోనే జరిగింది ఈ దారుణమైన సంఘటన. మధురై లో 100 అడుగుల ఎత్తులో విజయ్ పార్టీకి సంబంధించిన జెండాను బలమైన స్తంభంతో ఏర్పాటు చేశారు.

అయితే భారీ గాలి రావడంతో ఆ స్తంభం… జనాలు ఉన్నప్పుడే కింద ఒరిగిపడింది. అక్కడే ఉన్న ఓ కారుపై ఆ స్తంభం పడింది. ఈ నేపథ్యంలోనే… కారు నుజ్జు నుజ్జు అయింది. ఒక వ్యక్తి మరణించారు. కారులో ఉన్న వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా పరుగులు పెట్టారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో వైరల్ గా మారింది.