2023లో లాంచ్‌కు రెడీ అయిన OnePlus 11 5G స్మార్ట్‌ఫోన్..లీకైన్‌ ఫీచర్స్..!!

-

ఆండ్రాయిడ్‌లో తోప్‌ఫోన్‌ అంటే వన్‌ప్లస్.. ఇందులో ఎప్పటికప్పుడు క్రేజీ మోడల్స్‌ను కంపెనీ అందిస్తూ ఉంటుంది. తాజాగా ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. OnePlus 11 పేరుతో 5G ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నది.
2023 ఫస్ట్ క్వార్టర్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్ విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది. అయితే ఫోన్‌కు సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్‌ ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి… అవి ఎలా ఉన్నాయంటే..!!

OnePlus 11 5G స్పెసిఫికేషన్స్‌, ఫీచర్స్‌( అంచనా)

OnePlus 11 స్మార్ట్‌ ఫోన్ 6.7-అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే తో రూపొందుతున్నది.
1440 x 3216 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ తో అందుబాటులోకి రాబోతుంది.
120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 526 ppi పిక్సెల్ క్వాలిటీని కలిగి ఉంటుంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తో డిస్‌ప్లే ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది.
OnePlus 11 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌ రన్ అవుతుంది.
16GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.
OnePlus 11 స్మార్ట్‌ ఫోన్ 5000mAh బ్యాటరీతో రూపొందింది. 100 W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే 5G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, GPSతో పాటు USB టైప్-C పోర్ట్ ను కలిగి ఉంది.
అండర్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరో మీటర్, ఇ-కంపాస్, కలర్ స్పెక్ట్రమ్ సహా పలు ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి రేట్ల వివరాలు మాత్రం బయటకు రాలేదు.
కెమెరా క్వాలీటీ కేక..!
ఇక OnePlus 11 స్మార్ట్‌ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రాబోతున్నది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో హాసెల్‌బ్లాడ్-బ్రాండెడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. మెయిన్ కెమెరాలో 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. రెండో కెమెరా 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది.
ఇక మూడో కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ 2x లెన్స్‌తో రూపొందింది. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా రాబోతున్నది. ఫ్రంట్ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్‌ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం..

Read more RELATED
Recommended to you

Exit mobile version