ఏప్రిల్ 28న OnePlus Nord CE 2 Lite 5G, OnePlus 10R లాంఛ్…లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే..!

-

వన్‌ప్లస్ మళ్లీ రెండు మొబైళ్లను విడుదల చేయనుంది.. ఇటీవలే వన్‌ప్లస్ 10 ప్రో 5జీ లాంచ్ చేయగా.. ఇప్పుడు OnePlus Nord CE 2 Lite 5Gతో పాటు OnePlus 10Rలను స్మార్ట్ ఫోన్లు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వన్ ప్లస్ అంటేనే మినిమిమ్ ఉంటుంది. మరి ఈ ఫోన్ల ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి, ధర ఎంత, లాంచ్ డేట్ ఎప్పుడో ఇవన్నీ చూసేద్దామా..!
ఈ నెల 28వ తేదీన ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదలకానున్నాయి. అదే రోజు OnePlus Nord Buds టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌ను కూడా తీసుకురానుంది.

OnePlus Nord CE 2 Lite 5G హైలెట్స్ (అంచనా)

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 కంటే కాస్త తక్కువస్థాయి స్పెసిఫికేషన్లు, ధరతో వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.58 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో OnePlus Nord CE 2 Lite 5G వస్తుందని సమాచారం. ఈ మొబైల్‌ వెనుక 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సామర్థ్యంతో మరో రెండు కెమెరాలు ఉండనున్నాయి.
4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. వన్ ప్లస్ లో చౌకైన మొబైల్ గా ఇది ఉండనుంది. భారత్ మార్కెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 20,000 ఉండొచ్చని అంచనా.

OnePlus 10R హైలెట్స్..(అంచనా)

మొబైల్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5జీ ప్రాసెసర్‌తో రానుంది.
రియల్‌మీ జీటీ నియో 3 (Realme GT Neo 3) స్పెసిఫికేషన్లను ఈ మొబైల్‌ పోలి ఉంటుందని లీక్‌లు బయటికి వచ్చాయి.
6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే 10R వచ్చే అవకాశం ఉంది.
150వాట్లు (4500ఎంఏహెచ్ బ్యాటరీ), 80వాట్ల (5000ఎంఏహెచ్ బ్యాటరీ) ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వేరియంట్లు అందుబాటులోకి వస్తాయని సమాచారం.
ఈ మొబైల్‌ వెనుక 50 మెగాపిక్సెల్ Sony IMX766 ప్రధాన కెమెరా ఉండనుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉంటాయి.
మరోవైపు వన్‌ప్లస్‌ స్పెషాలిటీ అయిన అలెర్ట్ స్లైడర్ ఈ మొబైల్‌కు ఉండదు.
వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్ టీడబ్ల్యూఎస్‌ చెరో ఇయర్‌బడ్‌లో 41mAh బ్యాటరీ ఉండనుందని సమాచారం. అలాగే కేస్ 480mAh బ్యాటరీని కలిగి ఉందని లీక్ ద్వారా వెల్లడైంది.
గత ఏడాది విడుదలైన OnePlus 9R ధర 40,000 ఉండగా.. ఇప్పుడు OnePlus 10R ధర కూడా ఇంచుమించు ఆ రేంజ్ లోనే ఉంటుందని అంచనా.

Read more RELATED
Recommended to you

Exit mobile version