అద్భుతం.. త‌క్కువ ధ‌ర‌కే వ‌న్‌ప్ల‌స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌..!

-

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ చాలా త‌క్కువ ధ‌ర‌కే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్‌లో మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. వ‌న్‌ప్ల‌స్ నార్డ్ పేరిట ఈ ఫోన్ విడుద‌లైంది. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హించిన ఈవెంట్‌లో వ‌న్‌ప్ల‌స్ ఈ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరాతోపాటు 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 765జి ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఇది 5జి కి స‌పోర్ట్‌ను ఇస్తుంది. 12జీబీ వ‌ర‌కు ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఇందులో ఉంది. వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 5 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. దీనికి అల‌ర్ట్ స్ల‌యిడ‌ర్‌ను అందిస్తున్నారు. గ్లాస్ బ్యాక్ ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 4115 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉండ‌గా.. దీనికి వార్ప్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల ఫోన్ కేవ‌లం 22 నిమిషాల వ్య‌వ‌ధిలోనే 0 నుంచి 70 శాతం వ‌ర‌కు చార్జింగ్ పూర్త‌వుతుంది.

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ స్పెసిఫికేష‌న్లు…

* 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* 1080 x 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 765జి ప్రాసెస‌ర్‌, 6/8/12 జీబీ ర్యామ్
* 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్
* 48, 8, 5, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 32, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి
* 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ
* 4115 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వార్ప్ చార్జ్ 30టి ఫాస్ట్ చార్జింగ్

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ ఫోన్ బ్లూ మార్బుల్‌, గ్రే ఆనిక్స్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.24,999గా ఉంది. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.27,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.29,999గా ఉంది. వీటిని అమెజాన్‌, వ‌న్‌ప్ల‌స్ ఆన్‌లైన్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తారు. ఆగ‌స్టు 4 నుంచి ఈ ఫోన్ల‌ను కొన‌వ‌చ్చు. ఎంట్రీ లెవ‌ల్ మోడల్‌ను సెప్టెంబ‌ర్‌లో విక్రయిస్తారు. అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ఉంటే ఈ ఫోన్ల‌పై రూ.2వేల డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. దీనిపై జియో రూ.6వేల విలువైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ ఈ ఫోన్ల‌ను కొన‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version