చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత..త్వరలో మరో కమాండర్ లెవెల్ భేటీ..!

-

భారత్-చైనా సరిహద్దు సమస్యలకు ఇప్పట్లో పరిష్కారం దొరికేలా లేదు..లడఖ్‌,గాల్వన్ ఘటనలతో రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరింది..మే నెల నుంచి చైనా తూర్పు లడఖ్‌లో తిష్ఠ వేసింది. ఉత్తర సిక్కింలో కూడా భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ, ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి 8 సార్లు కమాండర్ లెవెల్ అధికారుల స్ధాయిలో చర్చలు జరిగాయి..ఇప్పటికి సమస్యలకు పరిష్కారం రాకపోవడంతో త్వరలో మరో దఫ చర్చలు నిర్వహించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.. కమాండర్ లెవెల్ ఎనిమిదో రౌండ్ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికి..నవంబరు 6న జరిగిన ఈ సమావేశంలో చెప్పుకోదగ్గ ఫలితాలేవీ కనిపించలేదు.

మే నెల నుంచి తూర్పు లడఖ్‌లో ఏర్పడిన సంక్షోభానికి తెరదించేందుకు త్వరలో మరోసారి భేటీ జరుగుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది..భారత్-చైనా మధ్య అరమరికలు లేకుండా, లోతుగా చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది..భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లోని దళాల ఉపసంహరణపై ఇరు దేశాల నేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. చర్చలను కొనసాగిస్తూ తదుపరి చర్చలను త్వరలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది..ఇరు దేశాల ఫ్రంట్‌లైన్ ట్రూప్స్ సంయమనం పాటించాలని, అపార్థాలను, తప్పుడు అంచనాలను నివారించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version