బిజినెస్ ఐడియా: తక్కువ పెట్టుబడితో మంచి లాభాలనిచ్చే వ్యాపారాలు..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారా…? అయితే మీకోసం కొన్ని బిజినెస్ ఐడియాస్. పైగా పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టాల్సినవసరం లేదు. తక్కువ పెట్టుబడితో అదిరే లాభాలని పొందొచ్చు. ఇక బిజినెస్ ఐడియాస్ గురించి చూసేస్తే..

online business

ఆన్లైన్ టిఫిన్ సర్వీస్ బిజినెస్:

చాల మంది ఇప్పుడు బయట టిఫిన్స్ ని తింటున్నారు. అయితే మీరు అలాంటి వారి కోసం ఆన్లైన్ టిఫిన్ సర్వీస్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ బిజినెస్ కోసం పెద్దగా ఖర్చులు ఉండవు. మీ ఇంట్లోనే మీరు టిఫిన్ తయారు చేసి మీ సమీప ప్రాంతాల్లోని కస్టమర్లకు డెలివరీ చేసుకోవచ్చు. ఇలా బాగా సంపాదించచ్చు.

బ్యూటీ పార్లర్ బిజినెస్:

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది మహిళలు పార్లర్ కి వెళ్తున్నారు. మహిళలే కాదు పురుషులకు కూడా బ్యూటీ పార్లర్లు వస్తున్నాయి. మీకు ఈ బిజినెస్ పై ఆసక్తి ఉంటే కనుక తక్కువ ఖర్చుతోనే ప్రారంభించవచ్చు. కొన్ని మిషన్లు, పరికరాలు కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది. ఇలా ఈ బిజినెస్ ని రన్ చేసి మంచిగా ప్రాఫిట్స్ ని పొందొచ్చు.

టీ షర్ట్స్, మగ్ ప్రింటింగ్:

కప్పులు, టీ షర్ట్ లపై ఫొటోస్ ని ప్రింట్ చేయించి ఇస్తే బాగుంటుంది. దీనికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలా ఈ బిజినెస్ చేసి మంచి లాభాలు పొందొచ్చు. పైగా ఈ వ్యాపారాలకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version