దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు క్రమంగా పెరిగిపోతున్న క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ కాలర్ ట్యూన్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా అవెర్‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది సైబర్ గాళ్ల వలలో చిక్కుకుని రూ. లక్షలు పొగొట్టుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి? నకిలీ వెబ్‌సైట్లను ఎలా గుర్తించాలనే దానిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ.. నకిలీ వెబ్‌సైట్-ఒరిజినల్ వెబ్‌సైట్‌కు మధ్య తేడాను గుర్తించలేక అమాయక ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఏదైనా వెబ్‌సైట్ పేరులో యూఆర్ఎల్(URL) ఉంటే కచ్చితంగా దీనికి ముందు హెచ్‌టీటీపీ(HTTP) ఉంటుందని, అలా లేకుంటే నకిలీ వెబ్ సైట్ అని స్పష్టంచేశారు. అదేవిధంగా ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే వెంటనే మరో వెబ్‌సైట్‌కి రీ డైరెక్ట్ అవుతుంటే అది కచ్చితంగా నకిలీదని గుర్తించాలని చెప్పారు. బాధితులు వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని సజ్జన్నార్ సూచించారు.