ఊరు పేరు భైరవ కోన మూవీ కి పెద్ద షాక్..!

-

సందీప్ కిషన్ హీరోగా ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. విఐ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వర్షా బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు తాజాగా ఈ సినిమా రిలీజ్ ని ఆపేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో వైజాగ్ కి చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ కేసు వేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ మోసం చేశారని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కి సంబంధించి ఏజెంట్ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ని ఐదేళ్లపాటు తన గాయత్రి దేవి ఫిలిమ్స్ కి అందజేస్తామని అగ్రిమెంట్ రాసి ఇచ్చారని ఇందుకోసం తన దగ్గర 30 కోట్లు తీసుకున్నారని అన్నారు.

కానీ అగ్రిమెంట్ ప్రకారం హక్కులు ఇవ్వకుండా అనిల్ సుంకర గరికపాటి కృష్ణ కిషోర్ మోసం చేశారని సతీష్ కోర్టు ని ఆశ్రయించారు తీసుకున్న డబ్బులు ఇచ్చే వరకు ఊరు పేరు భైరవకోన సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని కోరుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశానని వైజాగ్ సతీష్ అన్నారు. దీనిపై టీం స్పందించి మా సినిమా రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు లేవు అని సమస్యలు క్లియర్ అయ్యాయని అంది చిత్ర యూనిట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version