మీరు డబ్బులని ఆదా చేయాలనీ అనుకుంటున్నారా..? డబ్బులు పొదుపు చేయాలనుకునే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకుంటూ ఉంటారు. మీరూ ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలనీ చూస్తున్నారా..? అయితే ఇలా ఈజీగా చేయండి. సేవింగ్ ఖాతాతో పోలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ వస్తుంది. అందుకే అంతా ఆసక్తి చూపిస్తారు. మాములుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటే బ్యాంకు కి వెళ్లి ఓపెన్ చేయాల్సి వుంది. కానీ ప్రస్తుతం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
దానితో ఈజీగా మనం బ్యాంకు కి వెళ్లకుండానే పూర్తి చేసుకునేందుకు అవకాశం లభించింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఖాతాదారులకు ఆన్‌లైన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ చేసే అవకాశం ని ఇచ్చింది. కనుక ఏ ఇబ్బంది లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఆన్‌లైన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేసేయచ్చు.
దీని కోసం మొదట మీరు ఎస్‌బిఐ అధికారిక వెబ్ సైట్ www.onlinesbi.sbiను ఓపెన్ చేయండి.
తప్పనిసరిగా నెట్ బ్యాంకింగ్ మీకు ఉండాలి. లేదంటే నెట్ బ్యాంకింగ్ సేవల కోసం నమోదు చేయాలి.
నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
ఇప్పుడు డిపాజిట్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. డిపాజిట్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత టర్మ్ డిపాజిట్ ని సెలెక్ట్ చేయండి. ఆ తరవాత e-FDని సెలక్ట్ చేసుకోవాలి.
కావలిసిన పథకాన్ని ఎంచుకొని ప్రొసీడ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.
ఏ ఖాతా నుంచి డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో జమ చేయాలో చూడండి.
అమౌంట్ ని కూడా ఎంచుకోండి. ఒకవేళ వృద్ధులు అయితే సీనియర్ సిటిజన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
డిపాజిట్ కాలపరిమితి, మ్యెచురిటీ తేదీని సెలక్ట్ చేసుకోవాలి.
ఫైనల్ గా సబ్మిట్ బటన్‌ను క్లిక్ చెయ్యండి.