రాయ‌బార కార్యాల‌యాన్ని తెర‌వండి రక్షణ క‌ల్పిస్తాం.. భార‌త్‌తో తాలిబ‌న్లు

-

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబ‌న్లు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపు సంవ‌త్స‌రం కావ‌స్తుంది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు చాలా దేశాలు తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్ని గుర్తించ‌డం లేదు. దీంతో త‌మను గుర్తించండి అంటూ ప్ర‌పంచ దేశాల‌ను తాలిబ‌న్లు వేడుకుంటున్నారు. తాజా గా భార‌త్ తో తాలిబ‌న్లు సంప్ర‌దింపులు చేస్తున్నారు. ఆఫ్ఘాన్ లో భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని తేర‌వాల‌ని కోరుతున్నారు. రాయ‌బార కార్యాల‌య‌నికి భ‌ద్ర‌త ఇస్తామ‌ని తాలిబ‌న్లు కోరుతున్నారు. కాగ ఆఫ్ఘాన్ లో తాలిబ‌న్లు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌క ముందే.. భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తీసివేసింది.

కాగ ఈ రాయ‌బార కార్యాల‌యాన్ని తిరిగి ప్రారంభించాల‌ని తాలిబ‌న్లు కోరుతున్నారు. కాగ ఇటీవ‌ల ఆఫ్ఘాన్ లో ఆహార కొర‌త ఉండ‌టంతో భార‌త ప్ర‌భుత్వం 50 వేల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల‌ను తాలిబ‌న్లుకు పంపించింది. దీంతో తాలిబ‌న్లు.. భార‌త్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే పాక్ పై విమ‌ర్శ‌లు చేశారు. పాక్ కూడా త‌మ‌కు గోద‌మ‌లు పంపించింద‌ని అన్నారు. అయితే అందులో స‌గం కంటే.. ఎక్కువ పురుగు ప‌ట్టి ఉన్నాయని అన్నారు. ఆ గోధుమ‌లు పాడేయ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగం అయ్యాయ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version