ముగింపు దశకు ఆపరేషన్ గంగా… ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 17,400 మంది భారతీయులు స్వదేశానికి

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేర్చుతోంది భారత ప్రభుత్వం. ‘ఆపరేషన్ గంగ’ ద్వారా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు పోలాండ్, రోమేనియా, హంగేరీ, స్లొవేకియా దేశాల ద్వారా భారతీయులను ఏయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ ముగింపుకు చేరుకుంది.  ఫిబ్రవరి 22 నుంచి ప్రత్యేక విమానాల ద్వారా… భారతీయును స్వదేశానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 17,400 మంది భారతీయులను తీసుకువచ్చినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈరోజు 7 ప్రత్యేక విమానాల ద్వారా… 1314 మందిని తరలించినట్లు వెల్లడించింది. 

ఈ రోజు వచ్చిన విమానాలలో 4 న్యూ ఢిల్లీలో దిగగా, 2 ముంబైకి చేరుకున్నాయి. సాయంత్రం ఆలస్యంగా ఒక విమానం బయలుదేరుతుందని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. బుడాపెస్ట్ నుండి 5 విమానాలు, బుకారెస్ట్ , సుసెవా నుండి ఒక్కొక్క విమానాలు ఇండియాకు వచ్చాయని తెలిపింది. రేపు, సుసెవా నుండి 2 ప్రత్యేక పౌర విమానాలు నడపబడతాయని, 400 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు నాలుగు నగరాల్లో రష్యా కాల్పులు నిలిపివేడంతో సుమీలో చిక్కకున్న విద్యార్థుల కూడా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరనున్నారు. వీరిని కూడా త్వరలోనే ఇండియాకు రానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version