OTS బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాదు : మంత్రి బొత్స

-

వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ (OTS) అనేది బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ అన్నారు. ల‌బ్ధి దారుల‌కు గృహ హ‌క్కు క‌ల్పించడాని కే వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ అనే ప‌థ‌కాన్ని తీసుకు వ‌చ్చామ‌ని తెలిపారు. ఈ వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ ప‌థ‌కాన్ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లు వ్య‌తిరేకించ లేద‌ని అన్నారు. కానీ టీడీపీ యే అన‌వ‌స‌రం గా రాద్ధాంతం చేస్తుంద‌ని ఆరోపించారు.

వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ ప‌థ‌కం ద్వారా ఇల్లు క‌ట్టు కునే వారికి ఉండే ప్ర‌క్రియా ను సులువు చేశామ‌ని అన్నారు. ల‌బ్ధి దారులు నిర్ణీత మొత్తం లో డ‌బ్బు చెల్లిస్తే ఒకే సారి ఇళ్ల కు ఉచితం గా రిజిస్ట్రేష‌న్ అవుతుంద‌ని తెలిపారు. రూ. 15 ల‌క్ష‌ల తో ఇళ్లు నిర్మించు కునే వారు.. ప్ర‌భుత్వానికి కేవ‌లం రూ. 25 వేలు చెల్లించి రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చ‌ని మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ అన్నారు. ఈ వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ (OTS) అనే ప‌థ‌కాన్ని త‌మ ప్రభుత్వం బ‌ల‌వంతంగా తీసుకురావ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version