హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో గల కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయొద్దని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నేడు కూడా హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ధర్నాలు చేస్తున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తున్నారు. నిన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి సైతం చేశారు.
ఈ క్రమంలోనే అటు హెచ్‌సీయూ విద్యార్థులు, ఇటు ఓయూలో ఆందోళనలు, ధర్నాలపై నిషేధం విధించినందుకు గాను ఓయూ విద్యార్థులు కలిసి సచివాలయం ముట్టడికి కలిసి యత్నించారు. హెచ్సీయూ భూముల వేలాన్ని వెంటనే ఆపాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. లేనియెడల ఆందోళనలను పెద్దఎత్తున చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు సమాచారం.