మాకు బెదిరింపు కాల్స్ మళ్లీ చేస్తే 30 వేల మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తాం అని ఓయూ జేఏసీ నాయకులు తెలిపారు. అయితే కొన్ని రోజుల కిందట అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ జేఏసీ కి బెదిరింపులు వస్తున్నాయి. దాంతో ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేసారు ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులూ. ఇంటి పై దాడి చేసినందుకు అల్లు అర్జున్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని బెదరింపు కాల్స్ వస్తున్నట్లు.. చంపేస్తాం అని అల్లు అర్జున్ మనుషులు బెదరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇక అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో వందల కాల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తన అనుచరులతో ఫోన్ కాల్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ ది అని చెప్పిన వాళ్ళు.. మా నంబర్స్ సోషల్ మీడియా లో పెట్టి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ తమకు ఫోన్ కాల్స్ అగకపోతే వేల మంది విద్యార్థులతో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తం అని తెలిపారు. ఇక తమకు ఫోన్ లు చేసి బెదరిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఓయూ జేఏసీ నాయకులు.